గట్టి పోలిస్ బందోబస్తు..
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మంగళవారం మధ్యాహ్నం గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. ముందుగా రామాలయంలో ఏర్పాటు చేసిన సర్వజనిక్ గణేష్ మండపంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీలు, ఉత్సవ సమితి సభ్యులు, బిడిసి, గణేష్ మండప నిర్వాహకులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం అయింది. ముధోల్ లోని ఆయా గల్లీలో గణేష్ విగ్రహాల ను ప్రత్యేక వాహనంలో అలంకరించి, యువకుల, పిల్లల నృత్యాలు, మద్య శోభాయాత్ర సాగనుంది. ఇందుకు పోలీసుల భారీ బందోబస్తు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు .ఇద్దరు ఎఎస్పీలు, 6గురు సిఐలు, 20 మంది ఎస్ఐ లు, 200 మంది స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ముధోల్ లో ప్రారంభమైన గణేష్ శోభయాత్ర ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES