నవతెలంగాణ – పెద్దవంగర
త్రైత సిద్దంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక తొర్రూరు కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి ప్రతిమను అందంగా ముస్తాబు చేసి పెద్దవంగర పుర వీధుల్లో శనివారం శ్రీకృష్ణుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. మహిళలు గోపికల వేషధారణలో డీజే పాటలకు కోలాటాలు వేస్తూ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి తొర్రూరు కమిటీ అధ్యక్షుడు బొమ్మరబోయిన సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో ఆ ప్రాంతమంతా ఆనందమయంతో… పిల్లపాపలతో కళకళలాడుతుందని తెలిపారు. స్థానిక శ్రీకృష్ణ మందిరంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కైతోజ్ గణేష్, ఉడుత సంపత్, జమ్ముల యాకయ్య, తమ్మి అశోక్, దారం మధు, సైదులు, రాజు, శ్రీనివాస్, ఉమా, త్రైత జ్ఞానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES