సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్
గౌరారం వాగు సందర్శించిన సిపిఐ, రైతు సంఘం నాయకులు
నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ (పిఏ) గ్రామం వద్ద నిరంతరం ప్రవహిస్తున్న గౌరారం వాగు పై ప్రాజెక్టు నిర్మించాలని, సిపిఐ సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ పార్టీ పిలుపుమేరకు సిపిఐ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజద్ పాషా, సిపిఐ, రైతు సంఘం నాయకులతో, స్థానిక ఆదివాసులతో కలిసి ఆదివారం నర్సాపూర్ (పిఏ)గౌరారం వాగు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడ్వాయి మండలంలోని నర్సాపూర్ (కట్టువాగు) గౌరారం వాగు నిరంతరం ఎల్లప్పుడూ జీవ నదిల పారుతుందని, దీనిపై ప్రాజెక్టు నిర్మిస్తే స్థానికంగా నర్సాపూర్, కాటాపూర్, గంగారం, భూపతిపూర్, దామరవాయి, పంబాపూర్, బీరెల్లి రంగాపూర్ గ్రామపంచాయతీ లోని భూములకు కూడా సాగునీరు అంది రెండు పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నారు. ఆదివాసీలు, మిగతా ప్రజలు కలకాలం సుఖసంపన్నులుగా విదిజిల్లుతారని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రి సీతక్క, కలెక్టర్, సంబంధిత ఇరిగేషన్ శాఖల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన అన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి సీతక్క స్పందించి నర్సాపూర్ గౌరారం వారిపై ప్రాజెక్టు నిర్మించి ఆదివాసి గిరిజన, గిరిజనేతర రైతులకు అండగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు బండి నరసయ్య, ముత్యాల రాజు నారాయణ సింగ్, మంకిడి కృష్ణ, సమ్మయ్య, నారాయణస్వామి రాజేశ్వరరావు కొమరయ్య బండారి శ్రీనివాస్, మేడిశెట్టి ఆనందం, మద్దూరి రాజు, తల్లడి లక్ష్మయ్య, మల్లెల పాపయ్య, స్థానిక ఆదివాసి రైతులు తదితరులు పాల్గొన్నారు.
గౌరారం వాగు వద్ద ప్రాజెక్టును నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES