Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారుల హామీలను అమలు చెయ్యాలి

ఉద్యమకారుల హామీలను అమలు చెయ్యాలి

- Advertisement -

టియు జెఎసి చైర్మన్ సుల్తాన్ యాదగిరి..
నవతెలంగాణ – జగదేవుపూర్

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. బుధవారం జగదేవ్ పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధిపేట జిల్లా సన్నాహక సమావేశం జర్నలిస్ట్ పుట్ట రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో టీయు జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి,మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమంలో 369 మంది తుపాకి తూటాలకు బలైపోయారని,మలి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మిగిలిన ఉద్యమకారులు, శారీరకంగా, వృత్తి రిత్యా ఆర్థికంగా ఎంతో నష్టపోయినారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉద్యమకారులను ఆదుకుంటామని ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 250 గజాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి, ప్రతి నెల 30 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సిద్ధిపేట జిల్లా కమిటిని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు డొలక్ యాదగిరి, కళాకారులు మహమ్మద్ జహంగీర్,టీయు జేఏసీ నాయకులు గుండ యాదగిరి, గందమల్ల శ్రీనివాస్,గుండమల్ల శ్రీనివాస్,ఏలూరి బాబు,రాజేంద్ర ప్రసాద్, గంగి రాజు,విజయలక్ష్మి, అరుణ,కమల,చంద్రకళ, పెంట సత్యనారాయణ,కొత్త రామచంద్రం,బాలయ్య,చంద్రమౌళి,గిరిపల్లి మల్లేశం,భాగ్య, కనక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -