Sunday, April 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్‌ మ్యాన్డ్ కార్మికుల నిరసనను జయప్రదం చేయాలి

అన్‌ మ్యాన్డ్ కార్మికుల నిరసనను జయప్రదం చేయాలి

- Advertisement -

జిల్లా అధ్యక్షుడు బూర వరుణ్
నవతెలంగాణ – ఆత్మకూరు

తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-సిటియు రాష్ట్ర నాయకత్వం, టీజీ జీఎన్‌ పీడీ సీఎల్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ హనుమకొండ సర్కిల్ ఆఫీస్ ముందు బోజన సమయం లో నిరసన కార్యక్రమం జరుగనుంది. అన్‌మ్యాన్డ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌ కు సమస్యలపై మెమోరాండం సమర్పించనున్నాం. ఈ కార్యక్రమంలో హనుమకొండ సర్కిల్ పరిధిలోని అన్‌మ్యాన్డ్ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా  అధ్యక్షులు బూర వరుణ్ గౌడ్ ప్రకటనలో స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -