- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిట శ్రీహరి అన్నారు. బుధవారం అమర చింత మండలం చంద్రనాయక్ ,తుక్య తండాలో 12 లక్షలతో మంచినీళ్ల బోరు ను ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలు ,తాండాలకు అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజ్ గౌడ్ మహేందర్ రెడ్డి, అరుణ్ కుమార్, హనుమంతు నాయక్, దీప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -