దశలవారీగా సమస్యల పరిష్కారం : టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా
3వ మహాసభలో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-కందుకూరు
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వెళ్తోం దని పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జర్నలిస్టుల విషయంలో వెనుకడబోమని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని శుభం కన్వెన్షన్ హాలులో శుక్రవారం టీడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలి స్టుల ఫెడరేషన్) జిల్లా 3వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జర్నలి స్టులు సమాజానికి అద్దం పట్టే వృత్తిదారులు కావడంతో వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. ఇండ్ల స్థలాల కేటాయింపు, విద్యార్థుల ఫీజు రాయితీలు, ఆరోగ్య భద్రత వంటి అంశాలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తు న్నట్టు చెప్పారు. ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడిన సందిగ్ధతపై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుగు తున్నాయని, జర్నలిస్టులకు న్యాయం చేసే మార్గంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమాజ మార్పు కోసం విలువలతో కూడిన జర్నలిజం అవసరమని, ప్రజల సమ స్యలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కలం శక్తి ముందు ఎవరూ నిలవలేరని, కలం వల్ల ఎన్నో ప్రభుత్వాలు కూలిపోగా, కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ఉదాహర ణలు చరిత్రలో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పని చేస్తూ, ప్రభుత్వ దృష్టికి రాని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. జీతభత్యాలు లేకపోయినా, కుటుంబాలు కష్టాల్లో ఉన్నా కేవలం సమాజ మార్పు కోసం కలం పట్టి పనిచేస్తున్న జర్నలిస్టులు సమాజ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని ప్రశంసించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం, మంత్రి పొంగులేటి ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారని, మరోసారి కూడా రాష్ట్ర, జిల్లా ప్రతినిధుల బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై సమగ్ర నివేదికలను తయారు చేయాలని సూచించారు. ప్రజాప్రభుత్వం అందరీ సమస్యలను వింటుందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సభలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగగా, భవిష్యత్‌లో జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వం దగ్గర మరింత బలంగా వాదనలు వినిపించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు సోమయ్య, బసవపన్నయ్య, వివిధ పార్టీల నాయకులు, సంఘం రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రభుత్వం సానుకూల దృక్పథం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES