Sunday, January 18, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ అభివృద్ధి నమూనాపై ప్రజలకు విశ్వాసం

బీజేపీ అభివృద్ధి నమూనాపై ప్రజలకు విశ్వాసం

- Advertisement -

బెంగాల్‌ ర్యాలీలో ప్రధాని మోడీ

మాల్దా : దేశ ప్రజలు, ముఖ్యంగా జనరేషన్‌ జెడ్‌ బీజేపీ అభివృద్ధి నమూనాపై విశ్వాసం ఉంచారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. బెంగాల్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న చొరబాట్లు రాష్ట్ర జనాభాను మార్చుతున్నాయని.. మాల్దా, ముర్షిదాబాద్‌ వంటి జిల్లాల్లో అల్లర్లకు దారి తీశాయని, అధికార టీఎంసీ కారణంగానే చొరబాట్లు జరుగుతున్నాయని విమర్శించారు. బెంగాల్‌కు చొరబాట్లే అతిపెద్ద సమస్య అని మోడీ తెలిపారు. ”ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, సంపన్న దేశాలకు డబ్బు కొరత లేకపోయినా, అవి చొరబాటుదారులను వెనక్కి పంపుతున్నాయి. బెంగాల్‌ నుంచి చొరబాటుదారులను తొలగించడం కూడా అంతే అవసరం” అని ఆయన తెలిపారు. ”హృదయంలేని, క్రూరమైన టీఎంసీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోంది. కేంద్ర సహాయాన్ని బెంగాల్‌ ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోంది. బెంగాల్‌లో టీఎంసీ ఓడిపోయి, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే బెంగాల్‌ అభివృద్ధి జరుగుతుంది” అని మోడీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -