సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్త నరసింహులు
నవతెలంగాణ – భిక్కనూర్
ఈనెల 19వ తేదీ నాడు ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్త నరసింహులు తెలిపారు. గురువారం విలేకరులతో ఇళ్ల స్థలాల సాధన సమితి ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మేధావులలో ఒకరైన పార్లమెంట్ సభ్యులు సీపీఐ(ఎం) ఆల్ ఇండియా మాజీ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కేంద్రంలోని కళాభారతిలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్ రాములు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని మేధావులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఇండ్ల స్థలాల సాధన సమితి సభ్యులు, భూసాధన సమితి సభ్యులు, పోడు భూమి రైతులు, బీడీ కార్మికులు, హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార సదస్సు జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES