- Advertisement -
జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి
ప్రభుత్వ మెనూ ప్రకారం బాలికలకు ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవి లత కోరారు. గురువారం పట్టణంలోని సింగన్నగూడెం లో ఉన్న ఎస్టీ ఇంటర్ డిగ్రీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి వసతులలేమిని గుర్తించారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అడిగి సమస్యలను తెలుసుకున్నారు. సందర్శనలో హాజరైన ఇంచార్జి జిల్లా హాస్టల్స్ అధికారి సాహితికి అల్పాహారం, భోజన, పాలు మరియు ఇతరముల సదుపాయాలపై జిల్లా వ్యాప్తంగ సమీక్షించి తగిన చర్యలను తీసుకోవాలని సూచించారు.
- Advertisement -