Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజోష్ప్రతి వాక్యాన్నీ కవిత్వం చేయాలన్న తపన

ప్రతి వాక్యాన్నీ కవిత్వం చేయాలన్న తపన

- Advertisement -

అతడు సూర్యున్ని మంటగా చేసి పొయ్యిలో పెట్టగలడు. అరచేతల్లో చందమామలను గీయించగలడు. అదే సూర్యచంద్రులతో నేలకు పచ్చని రంగులు అద్దగలడు. మనిషి మనసుని వెలిగించే ‘నీటి దీపం’ అతడు ఎన్నో జ్ఞాపకాలను దాచుకునే ‘ఇన్‌ బాక్స్‌’, ‘గాలి లేని చోట’ కవితాక్సిజన్‌ అందించే కవి అతడు. తన అస్థిత్వాన్ని ‘వంకతాడు’గా తీసుకువచ్చిన యువ కవి, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు, విమర్శుకుడు తండా హరీష్‌గౌడ్‌తో ఈ వారం జోష్‌ మాటా మంతి..

”సూర్యచంద్రులను
రెండు కళ్ళుగా చేసుకొని
నేలకు పచ్చనిరంగులు
అద్దుతాడు”
అంటూ రైతు గురించి చెబుతూ కవిత్వంలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని ముందుకెళ్తున్న యువకవి తండ హరీష్‌ గౌడ్‌. వస్తువైవిధ్యం గల కవి. ప్రతి వాక్యాన్నీ కవిత్వం చేయాలన్న గాఢమైన తపన హరీష్‌ ది. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు ఆయన స్వగ్రామం. కవిత్వంలో భాగంగా ఇప్పటికి రెండు కవితా సంపుటాలను వెలువరించాడు. ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నా కవిత్వం ఆయన నిరంతర శ్వాస.
” నేను
బొబ్బలెక్కిన పాదాలను
నెత్తిమీదకు తెచ్చుకునేవాడిని
అహంకార శిరస్సును
పాదాలకు తొడుక్కునే వాడిని ”
తానేంటో ఒక కవిత స్టాంజా లొనే చెప్పుకున్న కవి తండ హరీష్‌ గౌడ్‌.

మీ స్వస్థల విశేషాలు?
నేను మహబూబాబాద్‌ మండలంలోని ముడుపుగల్‌ గ్రామంలో జన్మించాను. మా నాన్న మెకానిక్‌ షాపు పెడదామని పెద్ద గూడూరు గ్రామానికి వచ్చారు. ఆ కారణం చేత మా కుటుంబం పెద్ద గూడూరులో స్థిరపడవలసి వచ్చింది. పుట్టింది ముడుపుగల్‌. పెరిగింది పెద్ద గూడూరు.

మీ కుటుంబ నేపథ్యం?
మాది వ్యవసాయాధిరిత కుటుంబమే. నాన్న శ్రీహరి మోటర్‌ వైండింగ్‌ వర్క్స్‌ నేర్చుకుని మెకానిక్‌ గా స్థిరపడ్డారు. అమ్మ పుష్పలీల గహిణి. నా శ్రీమతి పేరు సంధ్య. నాకు ఇద్దరు పిల్లలు ఆర్యా చక్ర ప్రపుల్ల, సాయి ప్రద్యుమ్న. ప్రస్తుతం నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆలేరులో పనిచేస్తున్నాను.

మీ విద్యాసంబంధిత వివరాలు?
పదవతరగతి దాకా గూడూరులోని అరవింద విద్యాలయంలో చదువుకున్నాను. మహబూబాబాద్‌ లోని వికాస్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌… నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. పిహెచ్‌.డి తెలుగు డాక్టరేట్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందాను.

మీ పరిశోధన ఏ అంశంపై చేశారు. మీ పరివేక్షకులు ఎవరు?
నా పరిశోధనకు గైడ్‌ డా.ఎస్‌.రఘు గారు. ‘సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కవిత్వం-విమర్శ-పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశాను.

మీరు ఇప్పటివరకు వెలువరించిన రచనలు ఏమిటి?
2019 సం.లో నీటి దీపం అనే కవితా సంపుటితో సాహిత్య రంగ ప్రవేశం చేశాను. 2020లో ఇన్‌ బాక్స్‌ పుస్తకం ముద్రించాను. 2023లో ‘గాలి లేని చోట’ కవితాపుస్తకం వచ్చింది. దీనిని ఛాయా పబ్లికేషన్స్‌ వారు ముద్రించారు. 2025లో గౌడ్‌ వత్తి నేపథ్యంతో వంకతాడు పుస్తకాన్ని ముద్రించాను. ఇందులో నీటిదీపం, ఇన్‌ బాక్స్‌, వంకతాడు మూడు పుస్తకాలను మా బావగారు సద్గహ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ డెంకల సుధాకర్‌ ముద్రించారు.

మీ సాహితీ ప్రయాణాన్ని గూర్చి వివరించండి?
2013 మధ్య కాలంలోనే నా మొదటి కవిత ‘పల్లెజీవితం’ను రాశాను. అలా రాస్తూ రాస్తూ
తెలుగు సాహిత్యంతో నున్న అనుబంధంతో కొంత మంది పెద్దవాళ్ళ సలహాలు, సూచనలతో కవిత్వం రాయటంలో మెరుగవుతూ వచ్చాను. నా చుట్టు జరుగుతున్న సంఘటనల్లోంచే నా కవిత్వం పుట్టింది. నేను పనిచేస్తున్న బడిలో బఠానీలు అమ్ముకునే అమ్మను చూసి కవిత రాశాను. నేను రోజు సాయంత్రం పూట జొన్నరొట్టెలు కొనుక్కొని తిన్న గిరిజన లంబాడీ అమ్మ జీవితాన్ని కవిత్వం చేశాను. నాకు ఈ కవితలు రాయటంలో ఎంతో తప్తి కలిగింది. ఇలా రాస్తు పోతూ ఇప్పటి వరకు మూడు కవితాసంపుటులను ముద్రించాను. మొదటి పుస్తకంలో వివిధ వస్తువులను కవితలుగా మలచడంలో ఉన్న శ్రద్ధ రాను రాను మూడో కవితా సంపుటికి వచ్చేసరికి సామాజిక పరమైన కోణంలోకి, బహుజన దక్పథంలోకి పయనించింది. ఆ దక్పథాన్ని బలీయపరుస్తూ ‘వంకతాడు’ అనే పేరుతో గౌడ్‌ జీవన నేపథ్యంలో దీర్ఘకవితను కూడా తీసుకొచ్చాను. ఈ క్రమంలో కవిసంగమం, తెలంగాణ సాహితి నాకు ఒక వేదికగా నిలిచాయి.

నవతెలంగాణ సోపతిలో నిర్వహించిన కాలమ్స్‌ గూర్చి ?
నవతెలంగాణ సోపతిలో 34 వచన కవితా సంపుటాల మీద వ్యాసాలు రాస్తూ ‘వర్తమాన కవిత్వం’ పేరుతో ఒకటిన్నర సంవత్సరాల పాటు కాలమ్‌ నడిపాను. ఇందులో కొత్తగా పుస్తకాలు వేసుకున్న నా తోటి యువరచయితల మీదే నేను ఎక్కువ వ్యాసాలు రాశాను. ‘వర్తమాన కవిత్వం’ అనే పేరుతో ఈ మ్యాగజైన్‌ లోనే 49 మంది వచన కవుల కవితలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశాను. ఇందులో కవి పేరుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో ఫేస్‌ బుక్‌, వివిధ పత్రికల సాహిత్యపేజీలనన్నింటిలో వచ్చిన కవితలను చదివి ఉత్తమమైన కవితలను ఎంపిక చేసుకొని వ్యాసాలు రాశాను. అందుకు సహకరించిన నవతెలంగాణ బాధ్యులకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాగరంగ వెబ్‌ మ్యాజైన్‌ లో కూడా కొంతకాలం కాలమ్‌ రాశాను.

మీ విద్యార్థులతో కవిత్వం రాయిస్తున్నారా?
పాఠశాలలోని విద్యార్థులకు కవితలు రాయటం నేర్పిస్తున్నాను. వివిధ పత్రికలలో కవితలు అచ్చు అయినాయి. రాష్ట్ర స్థాయిలో కర్కముత్తారెడ్డి స్మారక కవితలు పోటీలో మా విద్యార్థి ‘పథ్వి’ బహుమతి సాధించాడు. రావుల వర్ష జిల్లా స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి సాధించింది.

మీరు పొందిన అవార్డులు?
నీటి దీపం(2019) కవితా సంపుటికి బి.ఎస్‌ రాములు స్ఫూర్తి పురస్కారం, జనరంజక కవి ప్రతిభా పురస్కారం
(రావి రంగారావు పీఠం), ఇన్‌ బాక్స్‌(2020) కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వచన కవితా పురస్కారం (2021), తెలంగాణ సారస్వత పరిషత్తు యువపురస్కారం (2022), కందికొండ రామస్వామి స్మారక వచనకవితా పురస్కారం -2020, ఆచార్య నెల్లుట్ల వచనకవితాపురస్కారం-2020, విమలశాంతి యువపురస్కారం -2020, షేక్‌ ఖాదర్‌ షరీఫ్‌ జాతీయస్థాయి యువపురస్కారం -2020, సాహితీ బందావన వేదిక ఉగాది పురస్కారం-2022, గాలిలేనిచోట (2023) కవితా సంపుటికి రొట్టమాకురేవు కవితా పురస్కారం-202, 4పీచర సునీతారావు స్మారక వచన కవితా పురస్కారం -2025 అందుకున్నాను.

అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad