Thursday, October 23, 2025
E-PAPER
Homeఖమ్మంరోజు దంచి కొడుతున్న వర్షాలు..

రోజు దంచి కొడుతున్న వర్షాలు..

- Advertisement -

తడిసిన ధాన్యపు రాశులు..
ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రాలు..
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి రోజు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ సంవత్సరం మే నెలలో కూడా వర్షాలు పడడంతో ముందస్తు వేసిన పంటలు చేతికొచ్చినాయి మణుగూరు చిన్నరాయిగూడంలో కురిసిన వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. రైతుల నోటి కాడికి వచ్చిన పంట వర్షం బారిన పడడంతో తీవ్ర నష్టానికి గురయ్యారు నేటి వరకు కొనుగోలు కేంద్రాలుప్రారంభించలేదు. ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేసి మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారు.  రైతులను ముంచేందుకు గోతి కాడ నక్కలా కాచుకొని కూర్చున్నారు. అప్పుల పేరుతో పంటలను లాక్కునేందుకు సిద్ధమయ్యారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -