- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ గ్రామం 13వ వార్డులోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాలలో నిర్వహిస్తున్న రాజ్యశ్యామల యాగం ఆదివారంతో పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిందని ధర్మపీఠం చైర్మన్ శీర్లవంచ కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైదిక ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాగం ద్వారా లోక కల్యాణం, శాంతి, సౌభాగ్యం సిద్ధించాలని ఆకాంక్షించారు. యాగ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, భక్తులు, వేద పండితులు హాజరయ్యారు.
- Advertisement -



