- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
స్థానిక సంస్థల(సర్పంచ్) ఎన్నికల్లో బాగంగా తన స్వగ్రామం కానాయపల్లిలో మాజీ ఎం.పి రావుల చంద్రశేఖర్ రెడ్డి, వరలక్ష్మి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్పూర్తి నింపడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గ్రామాలలో సిద్ధాంతపరంగా ఓట్లు అభ్యర్థించి ఎటువంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని అన్నారు.
- Advertisement -



