Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాగశాల పనులను పర్యవేక్షించిన ఆర్డిఓ.

యాగశాల పనులను పర్యవేక్షించిన ఆర్డిఓ.

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 3న జరిగే కార్తీక మాస మహా రుద్ర యాగాన్ని విజయవంతం చేయాలని పరకాల ఆర్డీవో కే. నారాయణ అన్నారు. సోమవారం రోజున పరకాల మున్సిపల్ కమిషనర్ కే. సుష్మతో కలిసి యాగశాల పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఫైర్, ఎలక్ట్రిసిటీ అధికారులు, కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలగూరి రాజేశ్వరరావు, పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, మహా రుద్రయాగ సమితి అధ్యక్షులు ఎర్ర లక్ష్మణ్ గారు సమితి కన్వీనర్ గందె రవి సమితి కోశాధికారి తోట భద్రయ్య మరియు రుద్రయ్యగా కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -