టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక ఎన్నికలను బహిష్కరించాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) భూనిర్వాసితులకు పిలుపునివ్వడం సిగ్గుచేటని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ అన్నారు. కేటీఆర్ అభివృద్ధి నిరోధకుడని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్వార్ధ రాజకీయాల కోసం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాటలను తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న విషయం అనేక పదవులు పొందిన కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణమైతే తెలంగాణ దశ,దిశ మారిపోతోందన్నారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సౌకర్యాలు, రోడ్లు, విద్యుత్తు, నీటి ప్రాజెక్టులు, మెట్రో నిర్మాణాలన్నీ ఆనాడు ఎంతో మంది ప్రజలు భూములిస్తేనే కదా? అని ప్రశ్నించారు. ఆ వాస్తవాలను ప్రజలకు వివరించి రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూములివ్వాలని కోరాల్సిన కేటీఆర్… స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని కోరడమంటే రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. హైడ్రా కూల్చివేతల వల్లగానీ, మూసీనది ప్రక్షాళన, పునరుద్ధరణ వల్లగానీ నిర్వాసితులైన పేదలకు పక్కా ఇండ్లు కట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రజలు ప్రతిపక్షాల ఊబిలో చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఖజానా అంతా రాబందుల్లా దోచుకుని, సకల సంపదలూ కొల్లగొట్టిన బీఆర్‌ఎస్ నేతలకు నాయకుడైన కేటీఆర్ అధికారం కోల్పోయిన అక్కసుతో అబద్ధాలు వల్లెవేస్తున్నారని విమర్శిం చారు. పదేండ్లు అభివద్ధి చేసుంటే, ఇండ్లు లేని లక్షల మంది పేదలు ఇంకా ఎందుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకే సార్ధకత లేకుండా చేసిన కేటీఆర్ ఇంకా కలల లోకంలోనే విహరిం చకుండా, కిందకు దిగి వాస్తవాల్లో జీవించాలని ఆయన సూచించారు.
అభివృద్ధి నిరోధక బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES