- Advertisement -
మహ్మద్ సలీం పిలుపు
పాట్నా : బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో వామపక్షాల అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. హయాఘాట్‌లో సిపిఎం నుంచి పోటీ చేస్తున్న శ్యామ్ భారతికి మద్దతుగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మహ్మద్ సలీం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. హయాఘాట్‌లో ఈ దఫా ఎర్రజెండా ఎగరాలని, శ్యామ్ భారతిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల అపారమైన ప్రేమ, ఆదరణ చూస్తుంటే ఇక్కడ ఎర్రజెండా విజయఢంఖా మోగించడం ఖాయంగా కనిపిస్తోందని సలీం విశ్వాసం వ్యక్తం చేశారు.
- Advertisement -



