Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'వారణాసి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘వారణాసి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రధారులుగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. శ్రీ దుర్గా ఆర్ట్స్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కెఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్‌లో జరిగిన గ్లోబ్‌ ట్రోట్టర్‌ ఈవెంట్‌ అంతర్జా తీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. తన అద్భుతమైన, అసాధారణ ప్రచార వ్యూహాలకు పేరొందిన ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్ర విడుదల ప్రచారాన్ని అద్భుతమైన రీతిలో ప్రారంభించారు.

నిన్న వారణాసి నగరం అంతటా విడుదల తేదీ పోస్టర్‌ బ్యానర్లు అకస్మాత్తుగా కనిపించడంతో దేశవ్యాప్తంగా అనేక చర్చలు నడిచాయి. శుక్రవారం నిర్మాతలు అధికారికంగా విడుదల తేదీని ధృవీకరించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 7, 2027న థియేటర్లలోకి రానుంది. మేకర్స్‌ బిగ్‌ స్క్రీన్‌ మీద ఒక భారీ, ఎపిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ బాబు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు. ఈ చిత్రం అందరినీ గర్వపడేలా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -