బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై : భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రతిష్ట దిగజారిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఫలితం ఈసీఐ దుష్ప్రవర్తన, నిర్లక్ష్యపు చర్యలను కప్పిపుచ్చలేదని పేర్కొన్నారు. ”ఈసీఐ ఖ్యాతి దిగజారింది. ఈ దేశ పౌరులు సమర్థవంతమైన, మరింత నిష్పాక్షికంగా పనిన చేసే ఈసీఐకి అర్హులు. ఓటమిపాలైనవారిలో కూడా విశ్వాసాన్ని నింపేలా ఎన్నికల సంఘం ఉండాలి ” అని స్టాలిన్ వివరించారు. జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, ఇతర కూటమి నేతలు అవిశ్రాతంగా ప్రచారం నిర్వహించారని ప్రశంసించారు. ఈ ఫలితంతో ఇండి యా బ్లాక్ ఎంతో నేర్చుకోవాలని స్టాలిన్ పేర్కొన్నారు. సంక్షేమాలు, సామాజి క, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని వివరించారు. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త రాజకీయ సవాళ్ల ను పరిష్కరించేందుకు వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరని వివరించారు.



