Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీల బాధ్యత సర్పంచులదే.!

అంగన్వాడీల బాధ్యత సర్పంచులదే.!

- Advertisement -

పర్యవేక్షణ కమిటీ చైర్మన్గా సర్పంచ్
ప్రతి నెలా సమావేశం, పౌష్టికాహారంపై సమీక్ష
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామాల్లో ఇప్పటి వరకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా వాటి పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్లకు అప్పగించింది. దీంతో అంగన్వాడీల్లో సర్పంచ్లు కీలక పాత్ర పోషించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసిన మేరకు 11మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి చైర్మన్ గా సర్పంచ్ వ్యవహరించగా..కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ ఉండనున్నారు. కమిటీ సభ్యులుగా స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఉద్యోగి, ఏఎన్ఎం, గర్భిణులు, బాలింతలు ఉంటారు.

మండలంలో 38 అంగన్వాడీ కేంద్రాలు
మండలంలో తాడిచెర్ల, వల్లెంకుంట రెండు ఐసీడీఎస్ క్లస్టర్లు ఉండగా క్లస్టర్లలో మొత్తం 38 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలన్నింటినీ సర్పంచ్లు పర్యవేక్షించడంతో పాటు సరుకుల వివరాలు, సకాలంలో పౌష్టి కాహారం అందించేదుకు కృషి చేయాలి. 2014లోనే అప్పటి ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టి కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ అవి నామమాత్రంగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి సీతక్క ఈ శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు ప్రతినెలా అందిస్తున్న పౌష్టికాహారంపై సర్పంచ్లు పర్యవేక్షణ ఉటుంది. లక్షల రూపాయల విలువగల సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాటించాల్సిన బాధ్యతలు..
అంగన్వాడీలు నిర్ణీత సమయంలో తెరుచుకుంటున్నాయా లేదా అని సర్పంచ్లు గమనించాలి. గర్భిణులు, బాలింతలతో పాటు పిల్లలకు అందుతున్న ఆహారం నాణ్యతను, అలాగే పంపిణీ సక్రమంగా జరుగుతుందో లేదో తనిఖీ చేయాలి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల హాజరును పర్యవేక్షించాలి. ప్రతి నెలా పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించి అంగన్వాడీలపై నివేదికను తయారు చేసి ఉన్నతాధి కారులకు పంపించాలి.

మంచి పరిణామం: జంగిడి శ్రీనివాస్..ఎడ్లపల్లి సర్పంచ్
అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్లకు అందిం చడం శుభపరిణామం. అంగన్ వాడీలలో సరుకులు పక్కదారి పట్టకుండా సరైన పద్దతిలో చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అందజేయడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి సర్పంచ్లు బాధ్యతలు చేపట్టడం ప్రతినెలా సమావేశమై అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం వల్ల ఆంగన్వాడీ కేంద్రాలు పరిపుష్టం అవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -