Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుసాయుధ పోరాట ఫలితమే…విలినం

సాయుధ పోరాట ఫలితమే…విలినం

- Advertisement -

– సీపీఐ(ఎం)మండల కార్యదర్శి శ్రీనివాస్

  • – చిట్యాల ఐలమ్మకు సీపీఐ(ఎం) ఘన నివాళులు

నవతెలంగాణ-బెజ్జంకి

తెలంగాణ సాయుధ పోరాట ఫలితమే నైజాం పాలన నుండి రాష్ట్రానికి విముక్తి లభించిందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్బంగా బుధవారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహనికి సీపీఐ(ఎం)మండల శాఖ అధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎర్రజెండా అధ్వర్యంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం దోరలను తరిమికొట్టి దోపిడీ నుండి ప్రజలకు విముక్తి కలిగించిందని శ్రీనివాస్ తెలిపారు. సీపీఐ(ఎం) నాయకులు సంగ ఎల్లయ్య, భొమ్మిడి సాయికృష్ణ, బండి చంద్రయ్య, బోనగిరి లింగం, కుంట సత్తయ్య, రఫీ, గాజ రాజు, చంద్రయ్య, నర్సింగం, నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -