Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్వరి ధాన్యం త్వరగా తరలించాలి..

వరి ధాన్యం త్వరగా తరలించాలి..

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి : అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని త్వరగా తూకం వేసి తరలించాలని మంగళవారం జిల్లా సహకార అధికారి పి రామ్మోహన్ సూచించారు. మండలంలోని రామారెడ్డి, పోసానిపేట్, ఉప్పల్ వాయి వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కళ్ళల్లో ధాన్యాన్ని తాడపకుండా టార్పలిన్ కవర్లతో భద్రపరచాలని, ఎండిన వడ్లను వెంటనే తూకం వేయాలని, ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సదాశివారెడ్డి, మానిటరింగ్ అధికారి సాయిలు, కడెం బైరయ్య, సిబ్బంది నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -