-పొంగిన వాగులు, అలుగుబారిన చెరువులు, కుంటలు
నవతెలంగాణ-ఆమనగల్ : తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో మండల కేంద్రముతో పాటు అన్ని గ్రామాలలో రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన వరి పంట నేలకొరిగిపోగా పత్తి పంట పూర్తిగా తడిసి ముద్దయింది. అధికారిక లెక్కల ప్రకారం మండలంలో రైతులు 7 వేల వరి, 11,700 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టం తీవ్రతను అధికారులు అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటల్లో వరద నీరు చేరి అరుగులుబారాయి.
పెట్టుబడికూడా వచ్చేటట్లు లేదు..
నాకున్న కొద్దిపాటి పొలంలో రూ.40 వేలకు పైగా పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరి పంట పూర్తిగా నేలకొరిగిపోయింది. అప్పుచేసి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాను వానకు నేల పాలయింది. అకాల వర్షానికి నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలి.
-కొప్పు కృష్ణయ్య, చింతలపల్లి గ్రామం
-నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..
తుఫాన్ వర్షాలకు పంట దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటల వివరాలను సమగ్రంగా సేకరించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని.
నేలకొరిగిన వరి..తడిసి ముద్దయిన పత్తి
- Advertisement -
- Advertisement -



