Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం

సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ రెండవ యూనిట్ ఆధ్వర్యంలో లింగాయపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరం మూడవ రోజు కార్యక్రమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామపంచాయతీ ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి, రోడ్లు ఊడ్చి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన రెండవ సెషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ యం.ఏ. సలీం  మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారం కోరే హక్కు ఉందని తెలిపారు.

సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో ఒక బ్రహ్మాస్త్రమని, దీని ద్వారా జవాబుదారీతనం, బాధ్యతాయుత పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చట్టం వినియోగం, దాని ప్రయోజనాలపై వాలంటీర్లకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి, వాలంటీర్లకు అభినందన సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే సలహాదారు భోనగిరి సద్గుణ రాజేశ్వర్  మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం లేకపోతే పౌరుల హక్కులు ప్రమాదంలో పడిపోయేవని, కావున ఈ చట్టాన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యం.డి. తాహెర్ హుస్సేన్, డాక్టర్ వి. అశోక్, భాగ్యలక్ష్మి, జామున, విజయలక్ష్మి, పవిత్రతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -