Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది

రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది

- Advertisement -

విద్యార్థులకు ప్రతిభ పాటవ పోటీలు  
మండల విద్యాశాఖ అధికారి ఏ రామదాసు 
నవతెలంగాణ – నెల్లికుదురు

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని మండల విద్యాశాఖ అధికారి ఆంగోతు రాందాస్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశా ల మేరకు గురువారం మండల కేంద్రం నెల్లికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మై ఇండియా – మై ఓటు అంశంపై మండల స్థాయి ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఒక మంచి ప్రజా నాయకుడిని ఎన్నుకోవటానికి భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు.

హర్వత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాసం చిత్రలేఖన పాటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు విజేతలకు బహుమతులు ప్రధానం చేసి ప్రథమ ద్వితీయ విద్యార్థులను జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపించనున్నట్లు ఎంఈఓ తెలిపారు. ఉపన్యాస పోటీలో ఎస్ దీక్షిత్ ప్రధమ బహుమతి ఎం మధు శ్రీ ద్వితీయ బహుమతి పాటల పోటీలో బి సందీప్ ప్రధమ బహుమతి వి శ్రావ్య ద్వితీయ బహుమతి చిత్రలేఖనం పోటీల్లో బి ఆనంద్ ప్రధమ బహుమతి జి శ్రీ వల్లి ద్వితీయ బహుమతి వ్యాసరచన పోటీల్లో జి జోష్నా ప్రధమ బహుమతి పి ప్రకృతి ద్వితీయ బహుమతి లను కైవసం చేసుకున్నట్లు ఎంఈఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాస్ బి దేవేందర్ ఎం లావణ్య మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్ బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -