Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాస్వామ్యంలో వెలకట్టలేనిది ఓటు హక్కు

ప్రజాస్వామ్యంలో వెలకట్టలేనిది ఓటు హక్కు

- Advertisement -

– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
 ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కు అని, ఈ హక్కు వెలకట్టలేనిదని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం తన సొంత గ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే నిస్వార్ధంగా పనిచేస్తారో, గ్రామ సంక్షేమం కోసం మీ మధ్యలో ఉంటూ పనిచేసే వారినే ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కు ఈ హక్కు, వెలకట్టలేనిదని ఓటు హక్కు చాలా గొప్పదన్నారు. మన గ్రామానికి ఎవరు బాగా పనిచేస్తారో నిర్ణయించే హక్కు ఓటు హక్కు అన్నారు. సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -