– ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్
నవతెలంగాణ-అంబర్‌పేట
ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సి. రోహిణి రెడ్డితో కలిసి ఆయన అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తా నుంచి పటేల్‌నగర్ వరకు ఓటు బచావో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ మూడుసార్లు ప్రధాని కాగా మరో మారు ప్రధాని కావాలనే ఆకాంక్షతో ఉన్నారన్నారు.దొంగ ఓట్లతో పీఎం కావడం సరికాదనీ, ప్రజల మధ్యకు వెళ్లి ఓటు వేయించుకోవడం గొప్ప అని పేర్కొన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కొన్ని సీట్లు మాత్రమే తక్కువయ్యాయని, నేడు దేశంలో మోడీ, అమిత్ షా కలిసి 65 లక్షల ఓట్లను తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలు పొందిన నాయకుడని కొనియాడారు. న్యాయం కోసం పోరాడితే రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామని బెదిరించడం సరికాదని హెచ్చరించారు. దేశంలో ఇప్పటికైనా దొంగ ఓట్లను గుర్తించి నిజమైన నాయకుడిని గెలిపిస్తే బాగుంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ముజాహిద్ ఖాన్, అప్సర్ యూసుఫ్ జాయి, ఆర్. లక్ష్మణ్ యాదవ్ శంభుల శ్రీకాంత్ గౌడ్, పులి జగన్, దిడ్డి రాంబాబు, గరిగంటి రమేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కును కాపాడుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES