Sunday, January 25, 2026
E-PAPER
Homeజిల్లాలుఅంబేద్కర్ కల్పించిన ఓటుహక్కు వజ్రాయుధంతో సమానం

అంబేద్కర్ కల్పించిన ఓటుహక్కు వజ్రాయుధంతో సమానం

- Advertisement -

– జనగామ గ్రామపంచాయతీ వద్ద ఓటు హక్కు వినియోగంపై అవగాహన 
నవతెలంగాణ – కామారెడ్డి

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై గ్రామపంచాయతీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం అని,  ఓటు హక్కు మన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం విధిగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “ఓటు వేద్దాం –  మార్పు తెద్దాం” అనే నినాదంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎం ఎన్ స్వామి, బీబీపేట్ తాసిల్దార్, జీపీఓ రవి,  జనగామ వార్డు మెంబర్లు రాజబాబు, నరసింహ చారి, బేళ్లే వంశీ, ఎమ్మార్వో గారు ఆకుల రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -