Monday, October 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అస్తవ్యస్తంగా మారిన రహదారి..

అస్తవ్యస్తంగా మారిన రహదారి..

- Advertisement -
  • ఇబ్బందులనెదుర్కొన్న వాహనదారులు  
  • నవతెలంగాణ – బజార్ హత్నూర్
    మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి కొల్హారి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన వంతెనకు ఇరువైపులా వేసిన మట్టి రోడ్డు బురదతో అస్తవ్యస్తంగా మారి  వాహనాలు  కూరుకపోయాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి.  కాగా మధ్యాహ్నం రెండు  గంటలలుగా భారీ వర్షం కురవడంతో ఇరువైపులా మట్టి రోడ్డు  పూర్తిగా బురదగా మారి వాహనాలు ముందుకు సాగక  దిగబడిపోయాయి. దీంతో ఇరువైపులా కిలోమీటర్  వరకు రహదారిపైనే  వాహనాలు స్తంభించిపోయాయి. వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు వర్షంలో ఎటూ వెళ్లలేక ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సకాలంలో రహదారి బాగుచేయాలని కోరుతున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -