Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి..

రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి..

- Advertisement -

నవతెలంగాణ – చారకొం
మండల కేంద్రం నుంచి రామాపురం చంద్రయన్ పల్లి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని బిజెపి నాయకులు మొగిళ్ళ కన్నా డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డులో ఉన్న గుంతలలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చారకొండ నుండి రామాపురం, చంద్రాయన్ పల్లి రహదారికి నిధులు మంజూరై స్థానిక ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ భూమి పూజ నిర్వహించినా.. ఇప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని,  లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -