Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్గోదావరి నది వెళ్ళే దారిని బాగు చేయాలి...

గోదావరి నది వెళ్ళే దారిని బాగు చేయాలి…

- Advertisement -
  • – కాంగ్రెస్ మండల యువ నాయకులు రావుల శ్రీనివాస్ 
    నవతెలంగాణ – ముధోల్

     ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన  ఆష్ట గోదావరి నది కి వేళ్ళే పుష్కర ఘాట్,నదికి ఆనుకుని ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఇంటెక్ వెల్ కి వెళ్ళే దారి వరద నీరు తో కోతకు గురైందని ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రావుల శ్రీనివాస్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు  మండలంలోని ఆష్ట గ్రామంలో పంట పొలాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు  గోదావరి నదికి అనుకుని ఉండడంతో వరదకు పూర్తిగా దెబ్బతింది అన్నారు. పంట పొలాల్లో నీరు చేరడంతో కొన్ని వందల ఎకరాల్లో చేతికొచ్చిన సోయాపంటతో పాటు పత్తి పంట సైతం నీట మునిగిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు వెంబడే రాకపోకలు కొనసాగిస్తూ ఎంతోమంది మత్స్యకారులు జీవనోపాధి కొనసాగించే వారని అన్నారు. అలాంటి వారికి ఇపుడున్న పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వారి జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇరిగేషన్ ఇంటెక్ వెల్ కి వెళ్ళే దారి సైతం కోతకు గురైందని  తెలిపారు.నీటి పారుదల శాఖ సిబ్బంది,ఉన్నతాధికారులు జరిగిన నష్టంపై  నివేదిక తయారు చేసి సమస్య పరిష్కారానికి మార్గం చూపాలన్నారు .ఈ విషయం ను జిల్లా  ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ దృష్టికి తీసుకెళ్లను న్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు .
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad