Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురోడ్లు ఇలా.. పాఠశాలకు వెళ్లేదెలా..

రోడ్లు ఇలా.. పాఠశాలకు వెళ్లేదెలా..

- Advertisement -

– పట్టించుకోని పాలకులు అవస్థల్లో విద్యార్థులు 
– చిన్న పోతంగల్ నుండి పెద్ద పోతంగల్ కు పాఠశాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు
నవతెలంగాణ – గాంధారి

గాంధారి మండలంలోని చిన్న పోతంగల్  నుండి పెద్ద పోతంగల్ కు నిత్యం సుమారు 40 మంది విద్యార్థులు ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థిని, విద్యార్థులు ఈ రహదారి వెంట చదువుకోవడం కోసం సంవత్సరం పొడుగునా వెళ్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు గ్రామాల ప్రజా ప్రతినిధులు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ పట్టించుకోకపోవడంతో పాఠశాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు . ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నోసార్లు పాత ఎమ్మెల్యేకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా వినతి పత్రాలు ఇచ్చామని ఎన్నోసార్లు చెప్పామని ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు విద్యార్థులు చదువు కూడా మానుకున్నారని వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలకు వెళ్లి చదువు కునే పరిస్థితి లేదని డబ్బున్న వారు ఎక్కడో కార్పొరేషన్ చదువుతుంటే మావిద్యార్థులు మాత్రం చదువుకు దూరం అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చిన్న పోతంగల్ నుండి పెద్ద పోతంగల్ వరకు బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులుకోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad