క్లబ్బు అధ్యక్షులు ఎన్నం సత్యనారాయణ
నవతెలంగాణ – మిడ్జిల్
దేశం కోసం ప్రాణాలనలను లెక్కచేయకుండా దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దేశ భద్రతలో సిఆర్పిఎఫ్ పోలీస్ పాత్ర మరువలేనిదని క్లాస్మెంట్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ సాహస దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా రంగాలలో రాణించాలని విద్యార్థులకు సూచించారు,విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి అలవాటు చేసుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖ సిబ్బంది దేశ రక్షణ కోసం చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని, ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని సూచించారు. అనంతరం 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు క్లబ్ సభ్యులు ప్రత్యేక బహుమతులను అందజేశారూ . దేశ భద్రతలో పోలీస్ శాఖ పాత్ర, సిఆర్పిఎఫ్సి సాహసాలు, క్రమశిక్షణ, ధైర్యం వంటి అంశాలపై వివరించి విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు సూచనలు చేశారు. అలాగే క్రీడలు ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమని, రోజువారీ వ్యాయామం ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సరస్వతి, క్లాస్ మేట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎం. విజయ్ కుమార్ గుప్తా, కోశాధికారి ఎండి జాంగిర్, క్లబ్ కార్యవర్గ సభ్యులు జూలూరి యాదగిరి, బరిగల ఆదం, పూరి రమేష్ గుప్తా , ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్, నరసింహ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.



