నవతెలంగాణ- ఆలేరు టౌను
ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఆలేరు పురపాలక కమిషనర్ బి శ్రీనివాస్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో మేనేజర్ బి జగన్మోహన్, నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ యేలుగల కుమారస్వామి, మున్సిపల్ సిబ్బందితో కలిసి, 2026 సంవత్సరం డైరీ , ఆఫీస్ క్యాలెండరుని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజా సమస్యల పరిష్కారానికి నవతెలంగాణ దినపత్రిక కృషి చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం చూపడంలో అధికారులు, సిబ్బందితోపాటు, జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.
తన సమస్యలు ఏమైనా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నవతెలంగాణ దినపత్రికలో విభాగాలలో పనిచేస్తున్న బాధ్యులకు జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఉస్మాన్ జాఫర్ షరీఫ్, పవన్ ,వెంకటేష్, సూపర్వైజర్ జంగిటి యాదగిరి, ఎండి జైనువుద్దీన్ సిబ్బంది ఎండి కాసిం, ఎలుగల రవి పాల్గొన్నారు.



