నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు,రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని, అధికారులు సమన్వయo గా పని చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కి సంబందించి, రిటర్నింగ్ అధికారులు,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకి ఎన్నికల విధులు, బాధ్యత లు, నియమ నిబంధన ల పైన శిక్షణ కార్యక్రమం ను జిల్లా కలెక్టర్ రెవిన్యూ వదిన కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత,రిటర్నింగ్ అధికారిదేనని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి సమకూర్చడం మొదలగు ప్రతి అంశాలను క్షుణ్ణం గా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నామినేషన్ల ప్రక్రియ కీలకమైనదని అన్నారు. అదనపు కలెక్టర్ నామినేషన్లపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి,ఎన్నికల నిర్వహణ కై వివిధ అంశాలకు కేటాయించిన ఆర్వో లు, ఏ ఆర్వో లు, ఎంపీడీవో లు మండల స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్లు, మండల్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ లు పాల్గొన్నారు.