Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యారంగంలో ప్రయివేటు టీచర్ల పాత్ర కీలకం

విద్యారంగంలో ప్రయివేటు టీచర్ల పాత్ర కీలకం

- Advertisement -

వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం :
ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మెన్‌ ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం
నవతెలంగాణ- ఉస్మానియా యూనివర్సిటీ

విద్యారంగంలో కీలకంగా ఉన్న ప్రయివేటు టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ ప్రొ.ఇటిక్యాల పురుషోత్తం అన్నారు. తెలంగాణ ప్రయివేటు టీచర్స్‌, లెక్చరర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎల్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హబ్సిగూడ ఒమేగా డిగ్రీ కాలేజీలో శనివారం కొమ్ము విజరు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మెన్‌ మాట్లాడుతూ.. ప్రయివేటు టీచర్స్‌ సేవల వల్ల కూడా విద్యారంగం ఉన్నతికి చేరిందని, వారు తెలంగాణ విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రయివేటు టీచర్లను ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు.

ప్రజా కవి జయరాజు మాట్లాడుతూ.. టీచర్స్‌ ఐక్యం కావాలని, అలాగే సమాజం పట్ల జాగరూకతతో వ్యవహరించాలని కోరారు. పర్యావరణం పట్ల అనుకూలతను, విద్యార్థులకు ప్రకృతి పాఠాలు బోధించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. విజ్ఞాన దర్శిని ఫౌండర్‌ టి.రమేష్‌ మాట్లాడుతూ.. విజ్ఞాన టీచర్స్‌, లెక్చరర్స్‌ సమాజ అభివృద్ధికి కీలకం అన్నారు. టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఏ.విజరు కుమార్‌ మాట్లాడుతూ.. ప్రయివేటు టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని, గుర్తింపు కార్డులు, వెల్ఫేర్‌ బోర్డు, హెల్త్‌ బీమా, సెలవుల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పాటల వెంకన్న అద్భుతమైన పాటలు పాడారు. అనంతరం సీనియర్‌ టీచర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్‌ సురేందర్‌, రాష్ట్ర నాయకులు యువరాణి, జె.నరసింహారావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్‌, నగర కార్యదర్శి ఎండీ జావిద్‌, నగర నాయకులు రాజయ్య, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్‌ రెడ్డి, లెక్చరర్స్‌ నాగార్జున, స్వప్న, ఉపేందర్‌, విజయరెడ్డి, ఇందిరా ప్రియదర్శిని, రాజు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -