Saturday, March 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

- Advertisement -

మండల ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి
నవతెలంగాణ – కుభీర్
గ్రామ పంచాయతిలో ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పారిశుధ్య కార్మికులు ఎంతో కృషి చేయడం జరుగుతుందని మండల పరిషత్ అధికారి గంగాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓ కార్యలయంలో 99రోజుల ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్య కార్మికులకు శలవా పూల మాలతో ఘనంగా సన్మానించి కిట్లు   పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో  ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు  వారు చేస్తున్న పనులను దృష్టిలో ఉంచుకొని వారి ఆత్మ గౌరవాన్ని ప్రతి ఒక్కరు కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ భీమేష్, పంచాయతీ కార్యదర్శులు, పరిశుద్ధ కార్మికులు, మండల సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -