Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర..

దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర..

- Advertisement -

పహల్గం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది…
నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ సంతోషిస్తుంది….
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్….
నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ 
: దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు జరుగుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. పహాల్గం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని తెలిపారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తమదైన శైలిలో దాడులకు పాల్పడడానికి చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. సాయుధ దళాల పోరాట పటిమ దేశ ప్రజలకు గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -