Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
HomeNewsకల్తీ నిర్మూలనలో ప్రజల పాత్ర ఎంతో అవసరం..

కల్తీ నిర్మూలనలో ప్రజల పాత్ర ఎంతో అవసరం..

- Advertisement -

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ
నవతెలంగాణ -కమ్మర్ పల్లి: కల్తీ కల్లు, మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో ప్రజల పాత్ర ఎంతో అవసరం ఉందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. గురువారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు నిర్మూలన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య  మాట్లాడుతూ ప్రజలు కల్తీ కల్లు సేవించడం తమ ప్రాణాలకు హానికరం అన్నారు.గ్రామాల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలై నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాలను నిర్మూలించడం లో ప్రజల పాత్ర ఎంతో అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాలు పూర్తిగా నిషేధించి యువతలో సత్ప్రవర్తన, మంచి నడవడిక రావాలన్నారు. అదేవిధంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుల్లో, క్రీడల్లో రాణించాలని కోరారు. కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను, కల్తీ కల్లును నిర్మూలించడం కోసం రాష్ట్రంలో పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, వైద్యశాఖల  ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుందన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా, మంచి దారిలో నడిచి భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు.అనంతరం గ్రామ యువతి, యువకులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు, ఇతర క్రీడా పరికరాలు అందజేసారు. కార్యక్రమంలో పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, వైద్య శాఖ, నార్కోటిక్స్ బృందం అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad