Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర గొప్పది

సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర గొప్పది

- Advertisement -

సీనియర్ సివిల్ జడ్జి నాగరాజ్
నవతెలంగాణ – కాటారం 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని ఎల్జీ గార్డెన్‌లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి జీవితాంతం వరకు అనేక కష్టాలు, వివక్షలు, హింసలను ఎదుర్కొంటూ కుటుంబం మరియు సమాజ శ్రేయస్సు కోసం తమ సర్వస్వాన్ని అర్పిస్తూ సమాజ అభివృద్ధికి వెన్నెముకలా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళలు మద్యపానం, మత్తు పదార్థాలు, గంజాయి వంటి దురవలవాట్లను సమాజం నుంచి నిర్మూలించేందుకు ముందుండి కృషి చేయాలని సూచించారు. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించి మహిళా ఉద్యోగులను జడ్జి నాగరాజ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, డి.ఆర్.డి.ఓ ప్రాజెక్ట్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యుష రెడ్డి, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీవో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి, సామల శ్రీలత, కోమల, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, బయ్యారం సర్పంచ్ ఏనుగల లింగయ్య, మద్దెలపెల్లి సర్పంచ్ రవి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ పుప్పాల శ్రీనివాస్, కంప అక్షయ, సీడీపీవో ఆర్. రాధిక, న్యాయవాదులు ఆకుల రాము, ఎన్. ప్రశాంత్, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లు సహా సుమారు 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -