తెలంగాణ ఉద్యమకారులు ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు గట్టయ్య యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు: శనివారం హన్మకొండలో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల పోరం దక్షిణ తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి రాష్ట్ర కార్యవర్గం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకారున్నారని తెలిపారు. భూపాల పల్లి జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమకారుల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా సంఘాలు నాయకులు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపి, ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.
రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES