Wednesday, January 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబస్సులను తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ

బస్సులను తనిఖీ చేసిన ఆర్టీసీ ఎండీ

- Advertisement -

– ప్రయాణంలో అప్రత్తత అవసరం
– డ్రైవర్లకు పలు సూచనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కర్నూలు ప్రయివేటు ట్రావెల్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సురక్షిత రవాణా సేవలను మరోమారు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తనిఖీ చేశారు. మియాపూర్‌-1 డిపోను ఆయన సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆ డిపోలోని లహరి స్లీపర్‌, లహరి ఏసీ స్లీపర్‌ కం సీటర్‌, రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులను తనిఖీ చేసి అందులోని ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన ఫైర్‌ డిటెక్షన్‌ అలారంతోపాటు ఫైర్‌ సప్రెషన్‌ సిస్టం పనితీరును పరిశీలించారు. అంతేగాక అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన స్టాండర్డ్‌ ప్రోటోకాల్‌ పద్ధతులను సిబ్బంది, అధికారులతో సమీక్షించారు. ప్రయాణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులన్నింటిలో ఎమర్జెన్సీ డోర్లు, అద్దాలను పగలగొట్టేందుకు అవసరమైన సంఖ్యలో బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు అన్ని వేళల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ బస్సులు బయలుదేరే ముందు ప్రయాణికులకు వెల్కమ్‌ మెసేజ్‌తో పాటు సేఫ్టీకి సంబంధించిన వివరాలు తెలియచేయాలని సూచించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ముందుగా ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రయాణికులకు నిరంతరం సురక్షితమైన రవాణా సేవలను అందించేందుకు సిబ్బంది కషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -