- Advertisement -
– 5 న మొదటి గ్రామసభ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. మొదటి సమావేశంలో ఈ నెల 5 న గ్రామసభ నిర్వహించి తాము చేయబోయే పనులను వెల్లడించనున్నట్లు గ్రామ సర్పంచ్ మోతె యాదగిరి గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండి అశోక్, వార్డ్ మెంబర్లు ఆకుల చిన్న గంగ గౌడ్, చిందల సుజాత, దాఖల ప్రియాంక, తెడ్డు బాలరాజ్, దంతపల్లి రాధా, వడ్డే లక్ష్మి, పంగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



