- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మేజర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ఇటీవల ఎన్నికై, బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో సోమవారం ప్రథమ గ్రామసభ సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా కార్యదర్శి, కారొబార్ అజ్మత్ అలీని శాలువాలతో పాలకవర్గం సత్కరించారు. అనంతరం పలు అంశాలపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొబ్బిలి రాజుగౌడ్,వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు చెంద్రయ్య, సారయ్య,పెడాకుల దేవక్క-సమ్మయ్య,తిర్రి అశోక్,కామ బాపు,నారమళ్ల రాజేశ్వరి,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



