డాలర్‌ఏ 91.73
భారత చరిత్రలోనే రికార్డ్ కనిష్టం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ అత్యంత అధ్వాన్న స్థాయికి పడిపోయింది. పతనంలో మరో నూతన రికార్డ్‌ను చవి చూసింది. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 92 చేరువకు పతనమయ్యింది. విదేశీ సంస్థగత మదుపర్లు వరుసగా తమ నిధులను తరలించుకుపోవడం, అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పంద అనిశ్చితి, పడిపోతోన్న రూపాయిని కాపాడటంతో మోడీ సర్కార్, రిజర్వ్ బ్యాంక్ విఫలం కావడంతో అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనవరి 21న ఒక్క పూటలోనే 76 పైసలు కోల్పోయి 91.73కు దిగజారింది.
ఫారెక్స్ ఎక్సేంజీ మార్కెట్‌లో ఉదయం 91.05 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 91.74 కనిష్టాన్ని చవి చూసింది. దీంతో ఒక్క డాలర్‌కు రూ.91.73 చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఒక్క నెలలోనే రూపాయి విలువ 1.50 శాతం విలువ కోల్పోయింది. ఇంతక్రితం 2025 డిసెంబర్ 16న డాలర్‌తో రూపాయి మారకం విలువ 91.14 కనిష్ట స్థాయిని చవి చూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 1.88 శాతం తగ్గి 63.70 డాలర్లుగా నమోదయ్యింది. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతులను తీవ్ర భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం అమాంతం పెరిగిపోనుంది.
తీవ్ర అగాథంలోకి రూపాయి
- Advertisement -
- Advertisement -



