డాలర్‌తో పోల్చితే రూ.90.74కు పతనం..
నూతన రికార్డ్ కనిష్టం
న్యూఢిల్లీ : భారత రూపాయి మరింత అగాథంలోకి పడిపోయింది. ప్రపంచ ద్రవ్య మార్కెట్‌లో గత కొంత కాలంగా క్రమంగా క్షీణిస్తూ వరుస రికార్డ్ కనిష్టాలను చవి చూస్తోన్న రూపాయి మారకం విలువ సోమవారం మరింత పతనమయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు బలహీనపడి రూ.90.74కి చేరింది. అమెరికా- భారత్ మధ్య వాణిజ్య చర్చలు దీర్ఘకాలంగా కొలిక్కిరా కపోవడం, విదేశీ పెట్టుబడిదారుల భారీ ఉపసంహరణలు, వాణిజ్యలోటు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరగడం వంటి కారణాల నేపథ్యంలో భారత రూపాయి సోమవారం చరిత్రలోనే అత్యత్ప కనిష్ట స్థాయికి పడిపోయింది.
రికార్డు కనిష్టానికి..
ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్ఛ్సేంజ్‌లో డాలర్‌తో రూపాయి 90.53 వద్ద తెరుచుకుంది. ఇంట్రాడేలో 31 పైసలు పతనమై ఏకంగా 90.80 కనిష్టాన్ని చవి చూసింది. పోలిస్తే రూపాయి 0.3 శాతం లేదా 25 పైసలు కోల్పోయి రూ.90.74కు క్షీణించింది. ఇది డిసెంబర్ 12న నమోదైన గత రికార్డు కనిష్టం రూ.90.55ను దాటడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి.. డాలర్‌తో పోలిస్తే దాదాపు ఆరు శాతం క్షీణించింది. ఆసియా కరెన్సీల్లో అత్యంత దారుణ ప్రదర్శన కనబర్చిన కరెన్సీగా రూపాయి ఉండటం గమనార్హం. ”వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడంతో విదేశీ నిధుల
విదేశీ పెట్టుబడిదారుల భారీ విక్రయాలు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులు 18 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారత షేర్లను విక్రయించారు. ఒక్క డిసెంబర్‌లోనే 500 మిలియన్ డాల ర్లకు పైగా విలువ గల బాండ్లను అమ్మారు. నవంబర్ లో సరుకుల వాణిజ్య లోటు 32 బిలియన్ డాలర్లుగా అంచనా ఉంది. అయితే ఇది అక్టోబర్‌లో నమోదైన 41 బిలియన్ డాలర్లతో పోలిస్తే కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి
భారత ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందం మార్చి నాటికి మాత్రమే సాధ్యమవుతుందని ఆయన చెప్పడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. ఇక ఇదే సమయంలో భారత్-యూరోపియన్ యూనియన్ (ఇయు) వాణిజ్య ఒప్పందం కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు లేవని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ శుక్రవారం నివేదించింది.
ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీ
డాలర్ సూచీ ఈనెలలో ఇప్పటి వరకు 1.1 శాతం పడిపోయినా.. రూపాయి మాత్రం ఈ ప్రయోజనాన్ని పొందలేకపోయింది. అమెరికా.. భారత్‌పై విధించిన 50 శాతం వరకు ఉన్న భారీ టారిఫ్‌లు ఎగుమతులను దెబ్బతీయడం, విదేశీ పెట్టుబడిదారులకు భారత మార్కెట్ ఆకర్షణ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు.



