డాలర్‌కు 15 పైసలు తగ్గి రూ.89.94
ఇప్పటి వరకు ఆరు శాతం క్షీణత
న్యూఢిల్లీ : భారత రూపాయి విలువ పడిపోయింది. ప్రపంచ ద్రవ్య మార్కెట్‌లో గత కొంత కాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న దేశీయ కరెన్సీ శుక్రవారం 15 పైసలు బలహీనపడి రూ.89.65కి పడిపోయింది. ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్‌లో డాలర్‌తో రూపాయి విలువ 89.84 వద్ద తెరుచుకుంది. ఇంట్రాడేలో 23 పైసలు పతనమై ఏకంగా 89.94 కనిష్టాన్ని చవి చూసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపాయి విలువ దాదాపు ఆరు శాతం క్షీణించింది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు దీర్ఘకాలంగా నిలిచిపోవడం, విదేశీ పెట్టుబడిదారుల భారీ ఉపసంహరణలు, వాణిజ్యలోటు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరగడం వంటి కారణాల నేపథ్యంలో భారత రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఆగని రూపాయి పతనం
- Advertisement -
- Advertisement -



