ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో..కాటారం తహశీల్దార్ నాగరాజు
నవతెలంగాణ – కాటారం
సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజల చేతిలో ఒక బ్రహ్మాస్రమని కాటారం తహశీల్దార్ నాగరాజు అన్నారు. సోమవారం కాటారం మండల తహసిల్దార్ కార్యాలయంలో 2026 యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ నూతన సంవత్సర క్యాలెండర్ ను తహశీల్దార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పాలనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో ఉండాలని తహశీల్దార్ అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ (యుఎఫ్) కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్,సభ్యుడు బూడిద రాజ సమ్మయ్య,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
స.హ చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



