Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్యాగధనుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ

త్యాగధనుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ

- Advertisement -

– కమ్మర్ పల్లిలో ఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్న త్యాగధనుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కమ్మర్ పల్లి పద్మశాలి విజయ సంఘం అధ్యక్షులు చింత హనుమంతు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, రాజీలేని తెలంగాణ పోరాట యోధుడు, మూడు తరాల ఉద్యమ నాయకుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి  వేడుకలను ఘనంగా నిర్వహించారు.హాస కొత్తూర్ చౌరస్తా వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి బంధువులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ తొలి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని కూడా వదులుకున్న త్యాగధనుడని కొనియాడారు. నిజం వ్యతిరేక పోరులో ఒకవైపు పాల్గొంటూనే, మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ భాగస్వామి అయ్యారన్నారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తపించారని పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని పద్మశాలి సంఘ భవనాల్లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ హనుమంతు, బొడ్డు శంకర్, ప్రసాద్, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -