Wednesday, October 22, 2025
E-PAPER
Homeకరీంనగర్పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి..

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి..

- Advertisement -

సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని సిరిసిల్ల రూరల్ మొగిలి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ మొగిలి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసే విధానం, పోలీస్ అధికారులను గుర్తించడం ఎలా, వారు అందించే సేవలు వంటి పలు విషయాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆయుధాల పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేంద్ర చారి, సిబ్బంది, ప్రధానోపాద్యాయుడు శంకర్ నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -